Na manchithanamanthayu nee yudata Hebron 2020 new songs

# Lyrics# Meaning # Instrumental # MP3# # Video # Images # Guitar Chords# 

 పల్లవి : నా మంచితనమంతయు నీ యెదుట కనుపరచెదను -
 యేసుక్రీస్తు సమస్తమును బాగుగా చేసి యున్నాడు

1.నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి యుంచిన మేలు ఎంతో గొప్పది
నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది
ఆ మేలులతో మమ్ము తృప్తి పరచుచు నిత్యము కాపాడుచుంటివి
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లెలూయ || నా మంచి||

2. తల్లి గర్భమందున  రూపింపబడక ముందే - నీ కన్నులు నన్ను చూచియున్నవి
నియమించిన దినములు ఒకటైన కాకముందే - నా దినములు గ్రంథములో లిఖితమాయెను
నీ తలంపులెంత నాకు ప్రియమైనవి ,- లెక్కించెదనంటినా అవి ఎంత గొప్పవి.  || హల్లే||

3. ఎన్నో దినాల మా కన్నీటిని చూచి- సంఘములో మాకు ఐక్యత నిచ్చినావు
సహవాసములో మాకు పాలును దయచేసి - హెబ్రోను సాక్ష్యమును  స్థిరపరచినావు
ఒక్కటిగా అందరము కలసి పాడెదం - హెబ్రోను దేవుని కొనియాడెదం || హల్లె||

4. దేవా నీ రాకడ ఎంతో సమీపం - సిద్ధపరచు మమ్ము ఇదే మా విన్నపం
మహిమ మేఘముపై నీవు వచ్చు చున్నావు - మా కొరకు జీతమును తెచ్చుచున్నావు  
మధ్యాకాశములో హల్లెలూయ పాడెదం - మా ప్రభువును మేము ఆరాధించెధం
||హల్లె||

Blessy  Wesly Songs

 Dr.John Wesly 

 Jk Christopher

  Dr.Jay Paul Chennai

  Dr. A.R Steevenson  

SP Balu songs 

 Baby Akshaya 

 Ringtones  

October 2020 songs