ఆనంద గీతాలు నే పాడుతు
యేస్సయ్య సన్నిధి నే చేరన "2"
ఎల్లవేళల యందు స్తుతియించుచు
హల్లెలుయ పాటలే పాడన "2"
" ఆనంద "
నేను నా ఇంటి వారందరు
యెహోవా ను సేవింతుము
రేయింబగలు కాపాడిన
కన్న తండ్రిని స్తుతియింతుము "2"
వాగ్దానములిచ్చిన దేవుడు
విడువడు నిన్ను ఎడబాయడు "2"
" ఆనంద "
నాదు యేసునీ దూతలతో
కలుసుకుందును మేఘాలలో
కష్టములు నా శ్రమలు ఆగిపోవును రాకడలో "2"
నా దుఃఖము ఇక వుండదు
ఆనందింతును హల్లెలుయా "2"
" ఆనంద "
Social Plugin