Jesus Loves you

  ప్రేమ.. యేసుని ప్రేమ  

 ప్రేమ.. యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది   నిజము దీనినినమ్ము ఇది భువిఅందించలేనిది !!2!!  
 ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ   ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ   !!
 ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది !!   
 తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించును    కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును !!2!!   
ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ   ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ   !!
 ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది !!  
 భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము   వాడిపోయిరాలును త్వరలో మోడులామిగిలిపోవును !!2!!   ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ   ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ   !!
 ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది !! 
 బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమదీపము   నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును !!2!!   ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ   ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ   !!
 ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది !!  
ధరలోన ప్రేమలన్నియు స్థిరముకావు తరిగిపోవును   క్రీస్తుయేసు కల్వరిప్రేమా కడవరకు ఆదరించును !!2!!   ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ   ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ   !! 
ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది !!  

Children Sunday School songs VBS Songs